అందోల్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య నాయకుల సమావేశం

సిరి న్యూస్ అందోల్ : అందోల్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గాప్రసాద్ విచ్చేసి మాట్లాడుతూ.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయినను వజోత్సవాలుగా జరుపుకోకపోవడం చూస్తుంటే రాజ్యాంగాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వాల చిత్తశుద్ధి ఇట్టే అర్థమవుతుంది, ప్రజలకు రాజ్యాంగం పలాలు ఏవైతే ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వాలన్నదో విద్యా, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయాన్ని, సంక్షేమాన్ని విస్మరించి అమలు కానీ ప్రయోజనము లేని ఉచిత పథకాలను ప్రకటించి వారి పగ్గాలు గడుక్కుంటున్నారు.

తప్ప రాజ్యాంగం కల్పించిన లక్ష్యాలను,ఆశయాలను సాధించలేకపోవడం ఈ ప్రభుత్వాల అసమర్ధతగా అంబేద్కర్ యువజన సంఘం భావిస్తుంది, కావున ఇకనైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన బాటలో నడుస్తూ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను, అవకాశాల పొందేటట్టు ప్రజలను చైతన్యం చేయాల్సిన ఆవశ్యకత ఉందని, రాజ్యాంగ పలాల కోసం, హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలి తప్ప రాజకీయ పార్టీలు వారి పంబ్బాలు గడుపుకోవడానికి ప్రకటించే ఉచిత పథకాలకు ఆశ పడొద్దు అని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారు జిల్లా కార్యదర్శి జోగ్యల్ల రాజు, పట్టణ అధ్యక్షులు భుజంగరావు,నాయకులు సంజీవయ్య, ఎం.మల్లేశం,ఆంజనేయులు, జి.మలేష్,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.