రైలు ఢీకొని వ్యక్తి మృతి..

రామయంపేట జనవరి 8 సిరి న్యూస్ః మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగింది.రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తి పల్లి గ్రామానికి చెందిన రంగయ్య గారి పెద్ద నరసింహులు అనే వ్యక్తి గత రాత్రి రైలు ఢీకొని రైలు పట్టాల పక్కన పడి మృతి చెందారు.ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.