గుంజేటిలో ఘ‌నంగా భోగి మంటలు

A huge bonfire in Gunjeti
A huge bonfire in Gunjeti

ఊరు వాడ సంక్రాంతి పండుగ సందడి..

ఝరాసంగం : సంక్రాంతి పండుగ గ్రామీణ పల్లె ప్రాంతాలలో ఈ పండుగను ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆనాది నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ముఖ్యంగా రైతులు తాము పండించిన పంటలు చేతికి వచ్చాక వచ్చే పండుగ కనుక రైతులు దీనిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు న్యాల్ కల్ మండల పరిధిలోని గుంజేటి గ్రామంలోని శ్రీ మానస దేవి ఆలయ ప్రాంగణంలో భోగి పండుగని పురస్కరించుకొని పట్లోళ్ల శివశంకర్ పాటిల్ అధ్వర్యంలో తెల్లవారుజామున భోగి మంటలు వేశారు.

ఈ సందర్భంగా శివశంకర్ పాటిల్ మాట్లాడుతూ.. ఆ మంటల్లో రైతుల కష్టాలన్నీ తొలగిపోతాయని రైతుల నమ్మకం అన్నారు.గ్రామస్థుల,యువత సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. రాభోయె రోజుల్లో మన సంస్కృతీ సంప్రదాయాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమలని నిర్వహిస్తము అన్నారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చంద్రన్న, గడీల ప్రభాకర్,బొమ్మ రవి,బండి సురేష్,ధర్మన్న, రాములు,శ్రీకాంత్, దశరత్, శ్రీనివాస్ యాదవ్, సాగర్ పాల్గొన్నారు.