గజ్వేల్ జనవరి 25(సిరి న్యూస్): సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో విద్యనభ్యసించిన 2000-2001 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇప్పలగూడెంలోని ఓ గెస్ట్ హౌస్ లో ఆదివారం గణతంత్ర దినోత్సవం రోజు ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పదవ తరగతి పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సభ్యులైన సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు నాయకులు రమేష్ దాచారం, పాత్రికేయులు పొట్ట అశోక్ కుమార్, ఇప్పలగూడెం మాజీ సర్పంచ్ భర్త చాడ సుధాకర్ రెడ్డి, తాడూరి వెంకటేష్, తాడూరి దుర్గా ప్రసాద్, గొల్లపల్లి సంతోష్ కుమార్, సిలివేరి స్వామి, మంగి స్వామి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రారెడ్డి, బంగారు రెడ్డి, పరమేశ్వర రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్, బాబు, సాధుల్లా, భాస్కర్, బైండ్ల రమేష్, పూర్వ విద్యార్థినిలు సంతోషి, రజిని, రాధిక, రేఖ, స్వప్న, రేణుక, యాదమ్మ, కనకరాణి, రాజేశ్వరి, లలిత, కనకజ్యోతి, కళావతి, లావణ్య, పూలమ్మ, కనకలత, స్వరూపరాణి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.