లాభాల బాటలో మహమ్మద్ నగర్ సహకార సంఘం
మూడు పర్యాయాలు సంఘం బలోపేతానికి కృషి చేశా
సొసైటీలో అసైన్డ్ భూములకు రుణాలు
సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మహాజన సభ లో సొసైటీ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి
కౌడిపల్లి ఫిబ్రవరి 6( సిరి న్యూస్) : లాభాల బాటలో మహమ్మద్ నగర్ సహకార సంఘం నడుస్తుందని, సహకార సంఘం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సంఘం చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం మహమ్మద్ నగర్ గేట్ వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం మహాజన సభ సహకార సంఘం అధ్యక్షులు బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంగం ఈ వార్షిక లావాదేవీలను సభకు వివరించారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుతం సొసైటీ కోటి రూపాయల పైగా లాభాల బాటలో నడుస్తోంది అని అన్నారు. సొసైటీ రైతులకు స్వల్పకాలిక ,దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు.
సహకార సంఘం సేవలు రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో అసైన్డ్ భూమి రుణాలు ఇవ్వలేమని ఇప్పుడు వచ్చిన జీవో ప్రకారం కొత్త రుణాలను అందిస్తున్నామన్నారు. చిన్న తరహా పరిశ్రమకు నాలుగు లేదా ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులు 30 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చని సూచించారు. సంఘానికి 364 మంది సభ్యత్వం కలిగి ఉందని సంగం షేర్స్ కోటి 11 లక్షల 30 వేల ఎనిమిది వందల తొంబై ఏడు రూపాయలు కలిగి ఉందన్నారు సంఘము వడ్ల కొనుగోలు ద్వారా వచ్చిన కమిషన్ నుండి సంఘం యొక్క నిర్వహణ ,సిబ్బంది వేతనం నూతన కార్యాలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. సొసైటీ ద్వారా 1108 మంది రైతులకు 8 కోట్ల 40 లక్షల 37,296 స్వల్ప కాలిక రుణాలు ఎల్టి లోన్స్ 52 మంది రైతులకు గాను 45 లక్షల 3358 రుణాలు అందించమన్నారు సంఘం నుండి 1159 మంది రైతులకు రుణమాఫీ వచ్చిందని మరో 415 మంది రైతులకు మాఫీ రావాల్సి ఉందని అన్నారు .30 మంది రైతులు అర్హత లేని వారు రుణమాఫీ రాలేదన్నారు. సంగం సభ్యులు రైతుల సూచనల మేరకు రెండు లక్షల వరకు ఉన్న ఖాతాదారులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. వెంటనే రుణమాఫీ కానీ రైతులకు మాఫీ చేయాలని అలాగే గోదాంలు నూతనంగా నిర్మించిన సంఘం భవనానికి ప్రహరి గోడ, తదితర అంశాలపై తీర్మానించారు. తాను మూడు పర్యాయాలు సంఘం అధ్యక్షులుగా కొనసాగాలని ఫిబ్రవరి 14 పదవీకాలం పూర్తుందని 15 సంవత్సరాలు తనను ఆదరించిన సంఘం సభ్యులకు రైతులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సంఘం అభివృద్ధికి తాను ఎప్పుడు కృషి చేస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో దుర్గా గౌడ్, డిసిసిబి ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్, సొసైటీ వైస్ చైర్మన్ చిలుముల చిన్నంరెడ్డి, డైరెక్టర్లు గాదే రాయగిరి, రమేష్ గుప్తా, పోచయ్య ,నర్సింలు మల్లేశం,రాములు,బాలు నాయక్, సొసైటీ పరిధి రైతులు, మహిపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి ,రఘు పటేల్, పాండ్ర నర్సింగరావు ,బోయిని వీరయ్య ,బాల గౌడ్, ,వెంకన్న, సంజీవ్, కుత్బోదిన్ ,అర్జున్, సుధాకర్,వీర రెడ్డి,పాం శేకర్, సిబ్బంది సుధాకర్ ,విష్ణు, అనిల్,కిషన్, తదితరులు పాల్గొన్నారు.
.