రాష్ట్రంలో ఘనంగా కుల గణన సర్వే చేపట్టాం

బిజెపికి దమ్ముంటే దేశవ్యాప్తంగా కులగణ‌న చేపట్టాలి
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్ ఫిబ్రవరి 05(సిరి న్యూస్) : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ఇందుకు సిద్ధం కావాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట అన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాలన్నదే రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు నివేదిక పెట్టి ఆమోదించడం చారిత్రాత్మకమని సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బిఆర్ఎస్, బిజెపి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. బీసీ జపం చేస్తున్న కేటీఆర్, బిసి గణనలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్రంలోని అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ స్థితిగతులను బహిర్గతం చేసిందని పేర్కొన్నారు.అన్ని రంగాల్లో వెనుకబడిన, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నిరక్షానికి గురయ్యారని విమర్శించారు.

బడ్జెట్లో రాష్ట్రానికి నయా పైసా ఇవ్వని బిజెపి ఇక్కడి బిజెపి కేంద్ర మంత్రులు , పెద్ద నాయకులు నోరు మెద పకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రం పట్ల వివక్షత చూపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పద్ధతి మార్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుంటే ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ప్రజలను ఏన్ని రకాలుగా మభ్యపెట్టినా, తప్పుదోవ పట్టించినా అవినీతి అక్రమాలకు పాల్పడిన కెసిఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయమని పెంచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, జంగం రమేష్ గౌడ్, గాడి పల్లి శ్రీనివాస్, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, ఇదుగాని శివులు, గుండు లక్ష్మణ్, జహీర్ బాగనోళ్ల మోహన్, డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు