నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలో పతంగుల షాపుల్లో ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎస్ఐ రావుల శ్రీశైలం సోమవారం నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన పట్టణం లోని పలు గాలిపటాల దుకాణాలు తనిఖీ చేసి చైనా మాంజా అమ్ముతున్న రెండు దుకాణాలపై కేసు నమోదు చేశారు. చైనా మాంజ, నైలాన్ మాంజ, అమ్మే విషయాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరూ సుఖ సంతోషాలతో జరుపు కొవాలని కోరారు. ఎక్కడ కూడా పతంగుల కూ చైనా మాంజ, వాడకూడదని అన్నారు. దీని వల్ల మనుషులకే కాకుండా పక్షులకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఎక్కడ ఈ మాంజ అమ్మినా తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు.