ఇద్దరు వైద్యులకు స్వల్ఫ గాయాలు..
శివంపేట: సోంపేట మండలంలోని ఉసిరికాపల్లి గ్రామ శివారులో వెల్దుర్తి నుండి తూప్రాన్ వెళుతున్న మార్గం మధ్యలో శంకర్ తండా దగ్గర అతివేగంతో వరి పొలంలో దూసుకుపోయిన కారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరికి తూప్రాన్, వెల్దుర్తి లలో నర్సింగ్ హోమ్ కలదు. డాక్టర్ శ్రీకాంత్ , లక్ష్మి లకు స్వల్ప గాయాలయ్యాయి. పోతుల బొగుడ నుండి ఉసిరికాపల్లి చౌరస్తా వరకు ఆరు కిలోమీటర్లు కొత్తగా రోడ్డు వేస్తున్నారు. రోడ్డుపైన కంకర ఉండడం , టర్నింగ్‌లో దిక్సూచి లేక ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.