నర్సాపూర్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు!!

నర్సాపూర్ జనవరి 26( సిరి న్యూస్ ) : 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండలంలో వివిధ ప్రభుత్వ ,రాజకీయ కార్యాలయాల దగ్గర ఆయా శాఖల అధికారులు,రాజకీయ నాయకులు త్రివర్ణ పతాకంఎగురవేశారు.అందులో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సునీతాలక్ష్మారెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ,ఆర్డీవో కార్యాలయంలో భూపాల్ రెడ్డి ఎమ్మార్వో కార్యాలయంలో శ్రీనివాస్ , ఎంపీడీవో కార్యాలయం,పోలీస్ స్టేషన్, గ్రంథాలయం ఓయూ పీజీ కాలేజీ , హాస్పిటల్ మరియు ఏ ఆర్ ఆర్ కార్యాలయంలో రాజిరెడ్డి బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు,కళాశాల పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.