తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్
రామయంపేట జనవరి 7 సిరి న్యూస్ : మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఓబీసీ నాయకులు (OBC Leaders) కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన పథకాలు అమలు చేయాలని కోరుతూ మండల తహసిల్దార్ రజనీకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన కుటుంబ సర్వే పేరిట రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేసిందన్నారు.
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ప్రకటించిన పథకాలు ఏమైనా అమలు చేశారా? ఈరోజు రామాయంపేట మండలంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలకు సిద్ధం కావాలని మా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్,మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బక్కయ్య గారి యాదగిరి,సీనియర్ నాయకులు వెలుముల సిద్ధరాములు,ఎర్రం శ్రీనివాస్ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వెలుముల రమేష్, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు,పట్టణ ప్రధాన కార్యదర్శి శీలం అవినాష్ రెడ్డి, సందీప్,నితిన్ తదితరులు పాల్గొన్నారు.