నివాళులర్పించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని కరస్ గుత్తి రోడ్లో గల శివరావు షెట్కర్ ఘాట్ వద్ద సోమవారం (స్వతంత్ర సమరయోధులు) నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు శివరావు షెట్కర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించిన. నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, ఆయన సోదరుడు డిసిసి ప్రధాన కార్యదర్శిపట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గొప్ప పోరాట యోధుడు శివరావు షెట్కార్: ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి..
స్వాతంత్ర సమరయోధులు దివంగత శివరావు షేట్కార్ 29వ వర్ధంతి సభలో భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సర్వధర్మ సమ్మేళనం సభ కార్యక్రమం లో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్ సర్వముఖా భివృద్ధికి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యేలు అప్పారావుషెట్కార్, శివరావుషెట్కార్, కిష్టారెడ్డిలు ఎనలేని కృషి చేశారని.. వారి అడుగుజాడల్లో నడుస్తూ కాం గ్రెస్ పార్టీని ముందుకు తీసుకు వెళుతూ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటన్నామన్నారు.
శివరావుషెట్కార్ దేశ స్వాతంత్ర్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతి రేకంగా పోరాడినట్లు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత సాధుసంతుల రాష్ట్ర ప్రతినిధి సంగ్రాం మహారాజ్, కర్ణాటకలోని బాల్కీ హీరేమఠం పీఠాధిపతి మహాలింగ పట్ట దేవరు,ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్,సంగీత జిత్తు షేట్కార్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్,టీపీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, శంకరయ్యస్వామి, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి,యువనేత సాగర్ షేట్కార్, శివరావు షేట్కార్,ఆనంద్ స్వరూప్ షేట్కార్, అప్పారావు షేట్కార్ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.