చేగుంట : మెదక్ జిల్లా చేగుంటలోని ఇండోర్ మల్టీప్లెక్స్ స్టేడియం గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి అండర్ 15 సెమీ కాంటాక్ట్ రగ్బీ సెలక్షన్స్ కి జిల్లా నలుమూలల నుండి 120 పైబడి క్రీడాకారులు, పాల్గొనగా అందులో నుంచి అత్యుత్తమ ప్రతిభ చూపిన 16 మంది క్రీడాకారునిలు, 16 మంది క్రీడాకారులను సెలెక్ట్ చేయడం జరిగిందని జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం గణేష్ రవికుమార్, మల్లీశ్వరి తెలిపారు.
ఎంపికయిన బాలుర విభాగంలో నరేష్ జడ్ .పి.హెచ్ యస్ చేగుంట,అభిచరన్ మెదక్,అఖిల్ రామాయంపేట,మనోహర్ మెదక్,నరేందర్ రామాయంపేట,ధీరజ్ నిజాంపేట్,విట్టు చేగుంట,చైతన్య చేగుంట,రవి,చరణ్ చేగుంట,శివ నిజాంపేట్,హర్షవర్ధన్ రామాయంపేట,బాలు మెదక్, స్టాండ్ బై గా చంద్ర రామాయంపేట,మధుకర్ నిజాంపేట్ కాగా,బాలికల విభాగంలో చేగుంటకు చెందిన లాస్య, గాయత్రి, దేవి, మౌనిక, దివ్య, పవిత్ర, అక్షయ మెదక్ చెందిన సారిభా,సాహితీ,నందిని నిజాంపేట కు చెందిన అరుణ,సంజన ప్రియ ఎంపికవగా,స్టాండ్ బై గా నిహరిక,వర్ష శ్రీ,సాత్విక,మధుప్రియ ఎంపికయ్యారని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర రిఫరీలు నవీన్,మహేష్,మోహన్,పి. డీ లు ప్రవీణ్,స్తుతి గీత,సరిత,దిలీప్,చంటి,కొచ్లు సంతోష్,ప్రభాకర్ పాల్గొన్నారు,ఎంపికైన వీరు ఫిబ్రవరి 1,2,3 తేదీలలో మంచిర్యాల జిల్లా కేంద్రం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు.ఎంపికైన వీరి పట్ల వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు,పి. ఈ. టీ లు హర్షం వ్యక్తం చేశారు.