ఫిబ్రవరి 3 నుండి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
పరీక్షల పటిష్ట నిర్వహనకు చర్యలు – కలెక్టర్ రాహుల్ రాజ్
సిరి, మెదక్ జనవరి 27 : పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని అందుకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. విద్యాబోధనలో పాఠశాలలు, ఇంటర్ కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో టెన్త్, ఇంటర్ లో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ముందుకు అధ్యాపకులు బోధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థిని విద్యార్థులను తప్పనిసరిగా పరీక్షల సమయంలో పాఠశాలకు కళాశాలకు హాజరయ్యే విధంగా పేరెంట్స్ చూడాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు గర్వించే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
ఫిబ్రవరి 3 నుండి ప్రాక్టికల్స్
ఇంటర్మీడియేట్ బోర్డు ఆదేశాల మేరకు 2024-25
విద్యా సంవత్సరమునకు గాను ఫిబ్రవరి 3 నుండి జిల్లాలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభించబడుతాయని, నాలుగు విడుతల్లో జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరానికి 6,660 మంది, రెండవ సంవత్సరానికి 6418 మంది విద్యార్థులు పాల్గొనగా మొత్తం 12,484 మంది ప్రయోగ పరీక్షకు హాజరు కానున్నారన్నారు. ఈ సారి ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇంటర్ బోర్డు నుండి పర్యవేక్షించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ విద్యుత్, ఆర్టీసీ, విద్య, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహిస్తున్నందున విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.