కొండాపూర్, జూన్ 8 (సిరి న్యూస్): పండుగ వేడుకలు మల్కాపూర్ లో ఘనంగా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు.. కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి జరుపుకునే పండుగలలో మొహర్రం (పీర్ల) పండుగ ప్రతి గ్రామంలో ముందు వరుసలోనే ఉంటుంది. హస్సేన్, హుస్సేన్ త్యాగమే మొహర్రం అని అంటారు. మలీదా, షర్బత్, రోట్ కొబ్బరి కుడకలు, దట్టీలు, పిర్లకు ప్రసాదంగా సమర్పిస్తారు. కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన హస్సేన్, హుస్సేన్ సంస్మరణార్థం కోసం ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉండి (రోజా) భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసారు. కొండాపూర్ మండల్ మల్కాపూర్ గ్రామంలో కుల మతాలకు అతీతంగా పీర్ల పండగ ఘనంగా జరిగింది. ఈ పీర్ల పండగ ఎక్స్ యం పి టీ సీ, మల్కాపూర్ మాజీ సర్పంచ్ విజయ భాస్కర్ రెడ్డి గారు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్,షేర్ అలీ, ప్రమోద్, ఖాజా పాషా, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.