సంగారెడ్డి ప్రతినిధి, జూలై 2 (సిరి న్యూస్): సంగారెడ్డి పట్టణంలో అతి పురాతనమైన మహా శక్తివంతమైన దుర్గమ్మ జాతర ఏర్పాట్లకై జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భాగంగా బుధవారం నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లకు ప్రారంభమైనవి. అందులోని భాగంగా జాతర ఏర్పాట్లు పరిశీలనకై నిర్మల జగ్గారెడ్డి, గుడి యొక్క ఆలయ కమిటితో మాట్లాడడం జరిగింది ఈ నెల 16 వ తారీకు నుంచి 21 వ తారీకు వరకు దుర్గమ్మ తల్లి జాతర, బోనాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో గుడి ఆలయ పూజారి నాగరాజు, తోపాజీ అనంతకృష్ణ ( టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) అలాగే కిరణ్ గౌడ్, కూన సంతు, శ్రీకాంత్ గౌడ్, మహేష్, గంగెడి శ్రీహరి పవన్, సందీప్, యాదగిరి తో పాటు గుడి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.