సంగారెడ్డి ప్రతినిధి, జులై 23 (సిరి న్యూస్):
సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశం
ఏకగ్రీవంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా,రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ వరప్రసాద్, అడ్వైజర్ జనార్దన్ రెడ్డి, డిస్ కంమ్ అధ్యక్షులు వేణు హాజరైనారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయిబాబా ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా నూతన అధ్యక్షులుగా కనకరాజు,ప్రధాన కార్యదర్శి గా గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కళ్యాణి బాయ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా సత్యనారాయణ
అడిషనల్ సెక్రెటరీ గా రవికుమార్, కోశాధికారి గా రాములు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న,కంపెనీ అడిషనల్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి తోపాటు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఏకగ్రీవంగా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక