సంగారెడ్డి ప్రతినిధి, జులై 14 (సిరి న్యూస్): సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పబ్లిక్ హెల్త్ ఈ ఈ ఎగ్జిగ్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. టి యు ఎఫ్ ఐ డి సి నిధుల ద్వారా సంగారెడ్డి ,సదాశివపేటలో చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. అమృత్ జల పథకం పనులను. పెండింగ్ పనులపై ఆరా తీశారు. సంగారెడ్డి పట్టణానికి 44 కోట్ల రూపాయలతో అలాగే సదాశివపేట 8.5 కోట్ల రూపాయలతో అమృత్ జల పథకం ద్వారా మంజూరైన పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న 9 పనులపై ఎస్ ఈ తో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొని పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేయాలని సూచించారు. సమీక్షలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కృష్ణ మోహన్ తదితరులు ఉన్నారు.