100వ వారం పూర్తి చేసుకున్న పీఎంకే ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం

సంగారెడ్డి ప్రతినిధి, జులై 14 (సిరి న్యూస్): సంగారెడ్డి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలోని పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం నేటికీ 100వ వారం పూర్తి చేసుకుంది, జిల్లా నలుమూల నుండి వివిధ సమస్యలతో సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ప్రభుత్వాసుపత్రికి ప్రజలు వస్తూ ఉంటారు వారిని దృష్టిలో పెట్టుకొని. పట్నం మాణిక్యం (డిసిసిబి వైస్ చైర్మన్), (పిఎంకె ఫౌండేషన్ చైర్మన్) పట్నం రవితేజ తమ సొంత నిధులతో పేద ప్రజలకు స్వచ్ఛందంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా 100వ వారం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ పేద ప్రజల కడుపు నింపుతున్న పట్నం మాణిక్యం ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆస్పత్రి సూపర్డెంట్ ని, వారి సిబ్బందిని పిఎంకె టీం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలోని పిఎంకె సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.