సిగాచి కంపెనీ మృతులకు యాజమాన్యం 1 కోటి ఎక్స్రేషియా అందజేస్తామని ప్రకటన

Oplus_16777216

సంగారెడ్డి, జూలై 2 (సిరి న్యూస్): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన దుర్ఘటనపై సిగాచి ఫార్మా ఇండస్ట్రీస్ యాజమాన్యం బుధవారం స్పందించింది. మృతుల కుటుంబాలకు తక్షణమే ఒక్కొక్కరికి రూ. 1 కోటి ఎక్స్రేషియా అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రమాదంలో మా సంస్థకు చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది పని దినసరికీ చికిత్స పొందుతున్నారని లేఖలో వివరించింది. రియాక్టర్ పేలుడు, అంశం సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని, పూర్తి కారణాలు విచారణ తరువాత వెల్లడిస్తామని స్పపం చేసింది. 90 రోజులు-సమస్త ఉత్పత్తి కార్యకలాపాల నిలిపి వేస్తున్నట్టు తెలియజేసింది. కంపెనీ భద్రతా నిబంధనలలో లోపాలున్నాయా అనే దానిపై ఇప్పటికే సాంకేతిక బృందం విచారణ ప్రారంభించింది. నివేదిక బయటకు వచ్చేవరకు ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని, బాధితుల కుటుంబాలకు తోడుగా ఉంటామని యాజమాన్యం హామీ ఇచ్చింది.