సంగారెడ్డి, జూలై 8 (సిరి న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు సోమవారం వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ను కలిసి వారు సమస్య వివరించారు. అర్హతలు ఉన్నా కూడా తమకు ఇళ్ల స్థలాలు రాలేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో యోగ్యత కలిగి, సొంత ఇల్లు లేకుండా కిరాయి ఇళ్లలో ఉంటూ, కేవలం జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకుని బ్రతుకుతున్న వారికి, అన్ని రకాల అర్హతలు ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ను కోరారు. ఈ క్రమంలో గతంలో కొందరికి అర్హత లేకున్నా కూడా ఇళ్ల స్థలాలు కేటాయించారని అట్టి వారిపై అధికారులు మరోసారి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని, అన్ని రకాల అర్హతలు కలిగిన జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.