అక్రమ ఇసుక సీజ్…ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అందజేత.

హత్నూర, జూన్ 30,(సిరి న్యూస్)
అక్రమంగా ఇసుక తవ్వకాల నిలువలపై స్థానిక తహసిల్దార్ సోమవారం తనిఖీ చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్ గ్రామంలో సుధాకర్ రెడ్డి అక్రమంగా కృత్రిమ ఇసుక ను త్రవ్వి నిలువ చేసిన ఇసుకను తహసిల్దార్ ఫర్హిన్ షేక్ సీజ్ చేశారు. నిలువ ఉంచిన సుమారు 6 లారీల ఇసుకను తహసిల్దార్ మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాల కొరకు మంగాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శికి అందజేశారని ఆమె తెలిపారు. ఆమె వెంట తన సిబ్బంది ఆర్ ఐ హరిబాబు ఉన్నారు.