బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

శంకరంపేట ఆగష్టు 01 (సిరి న్యూస్ ):మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త ధ్యానబోయిన సత్తయ్య గత వారం రోజులు క్రితం అనారోగ్యంతో మరణించగా బి.ఆర్.ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్వి మండల అధ్యక్షుడు ఇమ్మడి నరేష్ మాజీ ఉపసర్పంచ్ అరికెల శ్రీహరి మండల నాయకులు మెట్టు గణేష్, ధ్యానబోయిన భూమయ్య, గందే శ్రీశైలం, ఇమ్మడి రమేష్, నాయకులు, ధ్యానబోయిన వెంకట్, చిటుకుల లక్ష్మణ్, ధ్యానబోయిన రమేష్, సురేష్, శేరి నారాయణ, ధ్యానబోయిన శ్రావణ్, లింగం,విట్టల్, నాగరాజు,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.