సంగారెడ్డి ప్రతినిధి, జులై 14 (సిరి న్యూస్): తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఈనెల 19,20 తేదిలలో 10వ తెలంగాణ జూనియర్, సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఈతల పోటీలలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను సంగారెడ్డి పట్టణంలోని డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ ఫూల్ లో బాల బాలికలకు ఈతల పోటీలు నిర్వహించారు.స్విమ్మింగ్ జిల్లా ఇంచార్జ్ శేషు కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సిమ్మింగ్ అసోసియేషన్ నుండి సంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ గా విచ్చేసిన కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఈతల పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు.జిల్లా స్థాయిలో వివిధ విభాగాలలో విజేతగా నిలిచిన క్రీడాకారులందరికీ మెడల్స్ అందజేశారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రస్థాయిలో స్విమ్మింగ్ పూల్ కి జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని క్రీడాకారులకు సూచించిన డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ కాసిం బేగ్.కార్యక్రమంలో మహమ్మద్ సిద్ధిఖ్, మహమ్మద్ పర్వేజ్, అసిస్టెంట్ కోచ్ శివ, డిఎస్ఏ సిబ్బంది అభినవ్, పవన్, స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్, కృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు డి ఎస్ ఏ స్విమ్మింగ్ పూల్ లో ఈతల పోటీలు, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా...