రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు ఆదేశాలు -సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (సిరి న్యూస్):సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం పారిశ్రామిక వాడలో జరిగిన రియాక్టర్ పేలిన దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటించి పెట్టనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రమాదానికి కారణాలు, సహాయకచర్యల్లో పురోగతిపై ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలను సీఎం గుర్తించాలని అన్నారు. కంపెనీలలో లోపాలను గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. ఎక్స్పర్ట్స్ తో డిటైల్డ్ రిపోర్ట్ రూపొందించాలన్న సీఎంసహాయక చర్యలకు సంబంధించి విభాగాల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 1 లక్ష రూపాయలు, గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా అందించాలని సీఎం ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇది నష్టపరిహారం కాదని, కేవలం తక్షణ సాయం మాత్రమే అని అధికారులకు సీఎం తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు సీఎం తీసుకోవాలన్నారు. ట్రీట్మెంట్ ఖర్చుకు వెనకాడవద్దని, అవసరమైతే ప్రభుత్వమే వారి ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చు భరించేందుకు సీఎం సిద్ధంగా ఉందన్నారు. మృతుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.