చిన్నశంకరంపేట, జూలై 28 (సిరి న్యూస్): డిప్టేషన్ రద్దుచేసి మా టీచర్ ను మాకు ఇవ్వాలంటూ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గౌతమి డిమాండ్ చేశారు. పాఠశాల వద్ద సోమవారం నాడు విద్యార్థుల తల్లి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై శంకరంపేట మండల విద్యాధికారి పుష్పవేణి ని వివరణ కోరగా పాఠశాలలో 107 మంది విద్యార్థులు ఉన్నారని 120 ఉంటేనే ఐదుగురు టీచర్లు ఉండాలని నిబంధనతో ఒక టీచర్ ను డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించామని వివరణ ఇచ్చారు దీనివల్ల పాఠశాలలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని డిప్టేషన్ వెళ్లిన వెళ్లిన టీచర్ ను మళ్ళీ పాఠశాలకు పంపించాలని విద్యార్థుల తల్లి తండ్రులు డిమాండ్ చేశారు.
మండలంలో 100 మందికి పైగా ఉండే ప్రాథమిక పాఠశాలు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి వాటిలో కూడా ఉపాధ్యాయులను వివిధ కారణాలు చెప్పి డిప్యూటేషన్ లకు పంపిస్తే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతుందని ప్రభుత్వ పాఠశాలలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని విద్యావంతులు తెలిపారు.
Home జిల్లా వార్తలు డిప్టేషన్ రద్దుచేసి మా టీచర్ ను మాకు ఇవ్వండి. –విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన