సంగారెడ్డి ప్రతినిధి. జూలై 28 (సిరి న్యూస్):
సిగాచి కంపెనీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం కోటి పరిహారం ఇవ్వకుంటే టెంట్ వేసి కూర్చొంటాం అని సంగారెడ్డి కలెక్టరేట్ లో మాజీ మంత్రి హరీశ్ రావు తమ నిరసనను తెలియజేశారు. సిగాచి బాధితులకు పరిహారం అందేదాక, న్యాయం జరిగేదాక టెంట్ తీయం అని అన్నారు.
బాధితుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది
మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నెల మాసికం చేసుకుంటున్నారు. సీఎం వచ్చి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నెల రోజులు అయ్యింది. ఒక్కరికి అందలేదు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి. బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని కన్నీరు పెట్టుకుంటున్నారు. సిగాచి కంపెనీ ప్రమాద బాధితుల పక్షాన సంగారెడ్డి అడిషన్ కలెక్టర్ ను కలిసి డెడ్ బాడీలు అప్పగించడంలో, పరిహారం అందించడంలో వైఫల్యంపై మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీసారు. అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.