ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి
సంగారెడ్డి, జనవరి 17 ( సిరి న్యూస్ )
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఆర్ ఆర్ బి ఎస్ఎస్సి & బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్స్ కు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని 15- 02-25 నుండి బీసీ స్టడీ సర్కిల్, సంగారెడ్డి నందు వంద రోజులు శిక్షణ నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి , ప్రవీణ్ తెలిపారు.అర్హులైన సంగారెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర అభ్యర్థులు ఆన్లైన్లో వెబ్సైట్ www.tgbcstudycicrle.cgg.govt.in ద్వారా తేదీ12-02- 25 నుండి 09-02-25 వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రణీత్ తెలిపారు. మరిన్ని వివరాలకు 08455 – 277015, 994959299 నెంబర్లను లేదా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో వెలుగు ఆఫీస్ క్యాంపస్ బైపాస్ రోడ్, సంగారెడ్డి నందు ఆఫీస్ వేళలో నేరుగా సంప్రదించాలన్నారు