సంగారెడ్డి, జూన్ 30 (సిరి న్యూస్): ఇస్నాపూర్ మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రక్షణ సహాయ చర్యలు అందించడం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకోవడానికి వారికి తక్షణ సహాయ చర్యల కోసం 08455 276155 నెంబర్ తో కూడిన కంట్రోల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్షణ సహాయ చర్యల కోసం, ప్రమాద బాధితుల వివరాల కోసం ఈ నెంబరు లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.