కిరాణా షాపులో దొంగతనానికి విశ్వ ప్రయత్నం…

హత్నూర, జూన్ 23, (సిరి న్యూస్)
కిరాణా షాప్ లో దొంగతనానికి విశ్వ ప్రయత్నం చేశాడు యువకుడు. ఇంతకీ షట్టర్ తెరుచుకోకపోవడంతో ఉత్త చేతులతో వెళ్లిపోయాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సంగారెడ్డి జిల్లా
హత్నూర మండలం దౌల్తాబాద్ ఏ వెంకటేశం కిరాణా షాపులో గుర్తు తెలియని యువకుడు ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో చోరబడ్డాడు దొంగతనం చేయడానికి ఇనుప రాడ్ తో వచ్చి షట్టర్ తాళాన్ని పగలగొట్టాడు. షట్టర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. షట్టర్ లోపల నుండి మరో తాళం సెంటర్ లాక్ ఉన్నందున షట్టర్ తెరవ లేకపోవడంతో అక్కడ నుంచి జారుకున్నాడు.వీడి తో పాటు కాపలకస్తున్న మరో వ్యక్తి కూడా ఉన్నాడు.ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.దౌల్తాబాద్ గ్రామానికి చెందిన అరిగే వెంకటేష్ కిరాణా షాప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెట్ ముందు ఉంటుంది . దౌల్తాబాద్ గ్రామంలో వ్యాపారస్తులకు కిరాణా వర్తక సంఘం ద్వారా ప్రతి షాపును శనివారం లేబర్ హాలిడేగా మూసి వేయబడుతారు. దానికి అ దునుగా తీసుకొని దొంగతనానికి ఇలా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుందని షాప్ యజమాని తెలిపారు. గ్రామంలో ప్రతి కిరాణా షాప్ ముందు సీసీ కెమెరాలు ఉన్న ఏమాత్రం భయపడకుండా దొంగలు దర్జాగా దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారని,ఇలా హల్ చల్ చేస్తున్నారని కిరాణా షాపు యజమానులు వాపోయారు. దీనికి సంబంధిత పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.