బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన తపస్
రామాయంపేట జనవరి 17(సిరి న్యూస్)
రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ బలపరిచిని ముగ్గురు అభ్యర్థులకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) మద్దతు ప్రకటించింది. శుక్రవారం హయత్ నగర్ లో తపస్ రాష్ట్ర కమిటి, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి హన్మంతరావు, నవాత్ సురేష్ లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి తపస్ సమావేశానికి హాజరై ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించి ఉపాధ్యాయుల సమస్యలపై చట్టసభలో మాట్లాడేలా చేయడంలో తపస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ బలపరిచిన ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో మాట్లాడి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమావేశం లో అభ్యర్థులు మల్క కొమరయ్య, సీ. అంజిరెడ్డి, పులి సరోత్తం రెడ్డి, ఏబీఆర్ఎస్ఎం ప్రతినిధులు లక్ష్మణ్ జీ, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకట్రావు, రాష్ట్ర పదాధికారులు నరేందర్ రావు, పాపిరెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శులు బండి రమేష్, తెల్కలపల్లి పెంటయ్య, రామకృష్ణ రెడ్డి లు పాల్గొన్నారు.