మహబూబ్ నగర్లో జరిగే రైతు పండగ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతూ.. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో రేపు ఉదయం కొల్చారం మండల కేంద్రం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి పిలుపుమేరకు కొల్చారం మండలం నుండి రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది.
గడిచిన సంవత్సర కాలంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 54 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది.అందుచేత ఈ రైతు పండగ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది..ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రజా ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ ప్రజలు జేజేలు పలుకుతూ రేపు జరగబోయే రైతు పండుగ సభను విజయవంతం చేయవలసిందిగా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరడం జరిగింది.
రేపు ఉదయం 8 గంటలకు కొల్చారం మండల కేంద్రం నుంచి ఏవో శ్వేతాకుమారి మరియు మన నోడల్ ఆఫీసర్ అయిన బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులం అందరం కలిసి అట్టి సభకు బయల్దేరి రేవంత్ రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నాను.
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ గారు మెదక్ జిల్లా గ్రంధాల సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసినీ రెడ్డి గారు అలాగే ఎక్స్ ఎమ్మెల్యే మదర్ రెడ్డి గారు పాల్గొని ఉన్నారు
రేపు ఉదయం నర్సాపూర్ అసెంబ్లీ తాలూకా పరిధిలోని ఎనిమిది మండలాల నుండి వచ్చే రైతులు నాయకులు వారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో జరుగు సభకు బయలుదేరడం జరుగుతుంది.